HomeTelugu Trendingబాలీవుడ్ హీరోకు సమంత ప్రేమతో రిప్లై

బాలీవుడ్ హీరోకు సమంత ప్రేమతో రిప్లై

Samantha and Salman Khan
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సమంత ప్రేమతో కృతజ్ఞతలు తెలిపింది. “ఊ అంటావా మావా ఊఊ అంటావా” సాంగ్‌లో సమంత డ్యాన్స్ తనకు బాగా నచ్చిందని ఇటీవల ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల కార్యక్రమంలో సల్మాన్ అన్నారు. దానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా సమంత దానికి స్పందించింది. తన వర్క్‌ను గుర్తించిన సల్మాన్‌ ఖాన్‌కు లవ్ సింబల్ ఎమోజీతో సమంత కృతజ్ఞతలు తెలిపింది.

పుష్ప సినిమా కోసం తొలిసారి సమంత ఐటమ్ సాంగ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పుష్ప సినిమా. ఇందులో అల్లు అర్జున్‌తో కలిసి సమంత వేసిన స్టెప్స్ చాలా బాగున్నాయని సల్మాన్ మెచ్చుకున్నాడు. ప్రస్తుతం శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్న సమంత త్వరలో సల్మాన్‌తో నటించే అవకాశం లేకపోలేదు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu