హీరోయిన్ సమంత అమెరికాకు పయనమయ్యారు. ఎయిర్ పోర్టులో తన తల్లితో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స చేయించుకోవడం కోసమే ఆమె ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది.
అయితే ఆమె ఇప్పుడు అమెరికాకు బయల్దేరింది చికిత్స కోసం కాదు. రేపు న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామ్ పాల్గొనబోతున్నారు. ఆమెతో పాటు సినీ నటుడు రవికిషన్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Our cutie with mom off to New York 🤌🏼🫶🏼
Happy safe journey Sammy❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/bk0svKb7zS— RoshSam💌 (@RoshSamLover) August 18, 2023