మీరు మళ్లీ డేటింగ్ చేయొచ్చు కదా.. ఫ్యాన్ ట్వీట్ కి సమంత రిప్లై


స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్‌లోఓ బిజీగా ఉంది. గుణశేఖర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకురానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఆ సందర్భంగా ఒక అభిమాని సమంత క్యూట్ వీడియోను షేర్ చేసి.. మీరు మళ్లీ డేటింగ్ చేయొచ్చు కదా అంటూ మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫ్యాన్ పోస్ట్ కు సమంత సమాధానం ఇచ్చింది. మీరు ప్రేమించేంత గా నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ ఫ్యాన్ ట్వీట్ కి సమంత రిప్లై ఇచ్చింది.

సమంత రిప్లై వైరల్ అయ్యింది. ఫ్యాన్స్‌ కంటే ఎక్కువగా.. తనను ఎవరు ఇంతగా లవ్ చేస్తారంటూ సమంత ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత కు మళ్లీ ప్రేమలో పడే ఉద్దేశ్యం లేదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సమంత ఆమె మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా సమంత రెండేళ్ల క్రితం నాగచైతన్యతో విడాకులు తీసుకుంది.

ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో.. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక వైపు సమంత తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హిందీలో సినిమాలు మరియు సిరీస్ లతో బిజీగా ఉంది. శాకుంతలం సినిమాతో సమంత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. శాకుంతలం సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu