HomeTelugu Trendingస్విమ్ సూట్‌లో సమంత.. పిక్ వైరల్

స్విమ్ సూట్‌లో సమంత.. పిక్ వైరల్

Samantha in swim suit

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం బ్రేక్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఖుషికి ముందు కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ సిరీస్ వంటివి పూర్తి చేసి రెస్ట్ తీసుకుంది. మయోసైటిస్ చికిత్స కోసం సామ్ అమెరికా కూడా వెళ్లింది. అక్కడే పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వరుస అప్డేట్స్‌ తో ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది.

ఇటీవలే సాకి వరల్డ్, బల్గారి జ్యూవెల్లరీ వంటి పాపులర్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఫొటోషూట్ చేసింది సమంత. అందులో ఆ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడమే కాకుండా సమంత అందాలను చాలా ఘాటుగా ఎక్స్స పోజ్ చేసింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా సామ్ చేసిన ఫొటోషూట్ ఓ రెంజ్‌లో ఉంది. సమంత బజార్ ఇండియా సంస్థకు ఫొటోషూట్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి సమంత నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ చేసింది.

షార్ట్ హెయిర్‌తో చురకత్తుల్లా చూసే చూపులతో సమంత అందాలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. సినిమాల్లో బికినీ వేసిన సమంత చాలా రోజులకు ఇలా చాలా హాట్‌గా కనిపించడంతో నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు నోరు వెళ్లబెడతున్నారు. దీంతో సమంత స్విమ్ సూట్ పిక్ తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CzafTjGrCUz/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu