HomeTelugu Trendingచీరకట్టులో సమంత ఫ్యాన్స్ ఫిదా!

చీరకట్టులో సమంత ఫ్యాన్స్ ఫిదా!

Samantha in saree photos vi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించి తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్‌1న విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్డేట్స్‌కు మంచి స్పందన వస్తుంది. సమంత ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో సందడి చేస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో జరిగే 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు సమంత ఇటీవల అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె చీరకట్టులో కనిపించింది. ఇక అక్కడ మన వాళ్లు సమంతను చూసి ఫిదా అయ్యారు. మోడ్రన్ దుస్తుల్లో ఎక్కవగా కనిపిస్తుంది సమంత. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ ఇలా నిండుగా కనిపిస్తుండటంతో అంతా షాక్ అవుతున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన వెరైటీ చీరకట్టు ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu