ప్రముఖ నటి సమంత ఒక వైపున స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గానే నటిస్తూనే, మరో వైపున లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తోంది. అలా ఇటీవల కాలంలో ఆమె చేసిన ‘యు టర్న్’ .. ‘ఓ బేబీ’ సినిమాలు నటన పరంగా ఆమెకి మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. దాంతో నాయిక ప్రాధాన్యత కలిగిన కథలు సమంత వైపు ఎక్కువగా వెళుతున్నాయి.
అలా పీవీ సింధు బయోపిక్ కూడా సమంత దగ్గరికి వెళ్లినట్టుగా సమాచారం. వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి నటుడు సోనూ సూద్ రంగంలోకి దిగాడు. బాలీవుడ్ హీరోయిన్ తోనే ఈ బయోపిక్ ను రూపొందించాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆయన మనసు మార్చుకుని, సమంతతో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు.