HomeTelugu Trendingక‌డ‌ప‌లో సమంత సందడి

క‌డ‌ప‌లో సమంత సందడి

Samantha in kadapa shopping
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ స‌మంత కడపలో సంద‌డి చేసింది. క‌డ‌ప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్త నిర్మించిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్స‌వానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ షాపింగ్ మాల్‌ను ప్రారంభించి మాల్‌ కాసేపు సందడి చేసింది. దీంతో స‌మంత‌ను చూసేందుకు స్థానికులు అక్కడికి భారీగా త‌ర‌లివ‌చ్చారు.

దీంతో కడప బస్టాండ్‌ సమీపం జనసంద్రంతో నిండిపోయింది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక అక్కడికి వచ్చిన ఫ్యాన్స్‌ స‌మంత‌తో ఫొటోలు దిగేందుకు పోటీ ప‌డుతుండటంతో పోలీసులు భారీ బందోబ‌స్తూ ఏర్పాటు చేశారు. కాగా షాపింగ్‌ మాల్‌ ప్రారంభం అనంతరం ఆమె ఫ్యాన్స్‌కు అభివాదం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu