HomeTelugu Trendingసిటాడెల్ అప్‌డేట్ ఇచ్చిన సమంత

సిటాడెల్ అప్‌డేట్ ఇచ్చిన సమంత

Samantha Citadel update
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి కదా. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమాతో పాటు, సిటాడెల్ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ రెండు షూటింగ్‌లు పూర్తయ్యాక సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుంది. 3 రోజుల క్రితం సమంత ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టాలో అందరికీ షాక్ ఇచ్చింది.

ఇప్పుడు మరో కొత్త అప్‌డేట్‌తో ఇచ్చింది సమంత. ఈరోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని తెలిపింది. సెల్ఫీ ఫొటో షేర్ చేసిన సమంత ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పూర్తైంది’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది. రాజ్‌, డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్‌ధవన్‌, సమంత నటిస్తున్నారు. సిటాడెల్‌తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu