టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. అయితే విడాకుల తరువాత కూడా సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తనపై వస్తున్న రూమర్స్ కు కౌంటర్ ఇస్తూనే తనకు సంబంధించిన ఫొటోలను, తన విషయాలు అన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది.
అయితే తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫొటోలు అన్నింటినీ తొలగించేసింది. దాదాపు చైతో కలిసి ఉన్న 85 ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి సామ్ తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇకపై చైతో తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేసి జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నట్టుంది సమంత.