స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. దీని చికిత్స కోసం సమంత చేయబోతున్న ఖర్చు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం సమంత ఇండోనేషియాలోని బాలి టూర్లో ఉంది. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు పెడుతూ హైలైట్ అవుతోంది. అలాగే ఫిట్నెస్ వీడియోలు, ఫొటోలతో గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. ఇదిలా ఉంటే మయోసిటీస్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకోనుందట సామ్. అందుకోసం అమెరికా వెళ్లనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
సమంత తనకు చికిత్స కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇంత మొత్తాన్ని ఓ హీరో దగ్గర అప్పుగా తీసుకుందని అంటున్నారు.చికిత్స కోసం మయోసైటిస్ చికిత్సకు రూ. 25 కోట్లు ఖర్చు కానుండటం నిజం కావొచ్చు కానీ, అప్పు తీసుకునేంత పరిస్థితిలో సమంత లేదని చెబుతున్నారు. సినిమాలతో ఆస్తులు బాగానే సంపాదించిన సమంతకు అప్పు తీసుకునే అవసరం ఏంటని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సమంత స్పందించాలి.