ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చితరం ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపు ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెంసాంగ్ చేసింది. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా తెలిపింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ పాటలోని స్టెప్స్ నేర్చుకోవటానికి సామ్ ఎంత కష్టపడిందో ఒక వీడియో ద్వారా తెలియజేసింది.
ఊర మాస్ లిరిక్స్ కి సరిపడేలా డాన్స్ మాస్టర్ భాను అలాంటి స్టెప్స్ నేర్పించాడు. ఇక ఈ వీడియోలో సామ్ ఆ స్టెప్స్ నేర్చుకుంటూ కనిపించింది. డాన్స్ మాస్టర్ కఠినమైన స్టెప్స్ నేర్పించి టార్చర్ పెట్టాడని, నన్ను రిహార్సల్ తోనే చంపేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ స్టెప్స్ కోసం సామ్ ఒళ్లు హూనం చేసుకొని మరి నేర్చుకుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సినిమా వాళ్ళు అంత డబ్బు ఎందుకు తీసుకుంటారు అని అనుకుంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు అనడంలో తప్పు లేదని చెప్పుకొస్తున్నారు. బినెట్టింట అంటూ సామ్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#OoAntavaMavaOoOoAntavaMava Song Behind The Scenes @Samanthaprabhu2.
👉 https://t.co/skd3i51XYg , . #PushpaTheRise, #Samantha. pic.twitter.com/6OXxgK8Cqk. @alluarjun, @MythriOfficial, @ThisIsDSP, @iamRashmika, @aryasukku, @resulp, @adityamusic, @Dhananjayaka, @Mee_Sunil,
— Kodiyil Oruvan Gokul (@Kodiyil_Oruvan) January 6, 2022