HomeTelugu Trendingసమంత‌ చివరిగా ఏడ్చింది అప్పుడేనట!

సమంత‌ చివరిగా ఏడ్చింది అప్పుడేనట!

Samantha cried after watcheఅక్కినేని సమంత పెళ్ళైనతర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే కథల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తూ నటనకు ప్రాదాన్యం ఉండే పాత్రలను ఎంచుకుంటుంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన ’96’ రీమేక్ ‘జాను’ మాత్రం నిరాశ పరిచిన సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా సమంత బిజీ అవుతుంది. సమంత ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది సామ్. మీరు చివరి సారి గా ఎప్పుడు ఏడ్చారు.? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా… “నేను చివరగా ‘ఫ్యామిలీమ్యాన్’ సిరీస్ రషెస్ చూసినప్పుడు ఏడవడం ప్రారంభించాను” అని చెప్పుకుంది. అలాగే మరో నెటిజన్ ” మీకు వ్యవసాయంపై ఉన్న ఆసక్తి గమనిస్తున్నాం. మీరు వీకెండ్స్ లో నగర శివారుల్లో రైతులతో కలిసి వ్యవసాయం చేస్తే బాగుంటుంది కదా’..? అంటూ అభిమాని ప్రశ్నించగా… ‘మీరు చెప్పిన ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. థాంక్యూ దీనిగురించి నేను ఆలోచిస్తాను’ అని సామ్ రిప్లయ్‌ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu