HomeTelugu Trendingప్రభాస్‌ హీరోయిన్‌పై సమంత కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోయిన్‌పై సమంత కామెంట్స్‌

8 5యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్‌ నటి శ్రద్దా కపూర్. పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ భామ ఫైట్స్ కూడా అద్భుతంగా చేసింది. ప్రభాస్‌ పాత్రకు సమానమైన పాత్ర చేసింది ఈ బ్యూటీ. సినిమా ఫెయిల్ అయినా… కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. సాహో ఫెయిల్‌ అయిన తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ఆమె సినిమా ‘చిచ్చోరే’ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది.

శుక్రవారం రోజున రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లో రూ. 19.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ఇదిలా ఉంటె ఈ సినిమాను టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చూసిందట. చూసిన వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఈ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సినిమా చూశానని, చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది. శ్రద్దా కపూర్ అద్భుతంగా నటించిందని ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu