టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విశేషాలకు ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజగా సమంత తన భర్త చైతూ ఫొటోపై చేసిన చిలిపి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘థ్యాంక్యూ’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చైతూని తన కెమెరాలో బంధించాడు. చీకట్లో ఓ బెంచ్ పై కూర్చున్న నాగ చైతన్య, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా ఈ పిక్ కనిపిస్తోంది.
దీన్ని తొలుత చైతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దీన్ని పీసీ శ్రీరామ్ తీశారని, అటువంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషదాయకమని అన్నాడు. ఈ పిక్ కు నెటిజన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో సమంత కూడా స్పందించింది. “అరే… నా గురించే ఆలోచిస్తున్నావా?” అంటూ చిలిపిగా కామెంట్ చేసింది. సమంత కామెంట్ తరువాత ఈ పిక్ మరింతగా వైరల్ అయింది.
View this post on Instagram