టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత తన కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించింది. వరుసగా ప్రాజెక్టులను ఆమె ఒప్పుకుంటోంది. బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టేందుకు ఆమె సిద్ధమవుతోందనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ వార్తలపై సమంత క్లారిటీ ఇచ్చింది.
మంచి కథ వస్తే బాలీవుడ్ లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తానని ఆమె తెలిపింది. బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు కూడా ఉందని చెప్పింది. అయితే కథలో జీవం ఉందా? ఆ పాత్రకు నేను సెట్ అవుతానా? వంటి ప్రశ్నలను ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యేముందు తనకు తాను వేసుకుంటానని తెలిపింది.
మరోవైపు హీరోయిన్ తాప్సీకి చెందిన నిర్మాణ సంస్థ ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ చేయనుందని సమాచారం. ఇప్పటికే సమంత బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ ద్వారా ఆమె బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.