HomeTelugu TrendingSamantha Bollywood Projects: బాలీవుడ్ లో నడుస్తున్న సమంత హవా

Samantha Bollywood Projects: బాలీవుడ్ లో నడుస్తున్న సమంత హవా

Samantha Bollywood Projects
Samantha Bollywood projects surprises her fans

Samantha Bollywood Projects: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గత కొంతకాలంగా బాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటుంది. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత నెగటివ్ పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ తో హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన సమంత ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ది ఫ్యామిలీ మ్యాన్ ఈ దర్శకత్వం వహించినా రాజ్ అండ్ డీకే సమంతతో ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ తీస్తున్నారు. సిటాడెల్ అనే టైటిల్ తో వరుణ్ ధావన్ హీరోగా ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నిర్మాణంతర పనులు జరుగుతున్నాయి.

ఈ వెబ్ సిరీస్ కాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో కూడా సమంత పాత్ర కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాకముందే సమంత ఇప్పుడు మరొక బాలీవుడ్ వెబ్ సిరీస్ సైన్ చేసింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న రక్త బీజ్ అనే వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. మిగతా వెబ్ సిరీస్ తో పోలిస్తే ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Samantha Bollywood Projects:

అయితే వరుసగా హిందీ వెబ్ సిరీస్ లు సైన్ చేస్తూ వెళుతున్న సమంత బాలీవుడ్ సినిమాలలో ఎప్పుడు కనిపిస్తుందో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే పలు స్క్రిప్ట్లు సమంతని వెతుక్కుంటూ వచ్చాయని కానీ అవేవీ వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది.

అటు బాలీవుడ్ లో మాత్రమే కాక సమంత తెలుగు ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ లో సమంత మా ఇంటి బంగారం అనే ఒక సినిమా లో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా ఇంకా విడుదల కావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu