HomeTelugu Big Storiesసమంతకి ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు

సమంతకి ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు

10a 1ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటికి కోడలయ్యారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆమె ఆదివారం తన 32వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో సామ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖులతోపాటు అభిమానులు కూడా విష్‌ చేశారు. హన్సిక, తమన్‌, వెన్నెల కిశోర్‌, రష్మిక, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. వీరందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.

హన్సిక: పుట్టినరోజు శుభాకాంక్షలు అందమైన సమంత. ఎప్పుడూ సంతోషంగా ఉండు.
తమన్‌: జన్మదిన శుభాకాంక్షలు ప్రియమైన సమంత. హ్యాపీ మ్యూజికల్‌ బర్త్‌డే. నీకు ఈ ఏడాది మొత్తం సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి.
వెన్నెల కిశోర్‌: నీ కోసం నా ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌ మార్చా సమంత. హ్యాపీ బర్త్‌డే.
రష్మిక: హ్యాపీ బర్త్‌డే సమంత మామ్‌. పుట్టినరోజు నాడు కేక్‌లు, అందరి ప్రేమతో ఎంజాయ్‌ చేయండి. నీ అభిమాని రష్మిక.
సురేశ్‌ ప్రొడక్షన్స్‌: సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అనుపమ పరమేశ్వరన్‌: క్యూట్‌ సామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి.
రకుల్‌ప్రీత్‌ సింగ్‌: అందమైన వ్యక్తి సమంతకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది సంతోషం, నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఓ వ్యక్తిగా నువ్వు నాకు స్ఫూర్తిదాయకం. ఇలాగే ఆదర్శంగా జీవించు.
కోన వెంకట్‌: ది బెస్ట్‌ వ్యక్తికి నా బెస్ట్‌ విషెస్‌. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి.
రానా: హ్యాపీ హ్యాపీ టు యు సిస్టర్‌.

10 22సుశాంత్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్‌. ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌.. అందరికీ ఇలాగే స్ఫూర్తిగా ఉండు.
త్రిష: హ్యాపీ బర్త్‌డే సామ్‌. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా రాణించు.
మహేశ్‌ కోనేరు: దయ, నైపుణ్యం ఉన్న లవ్లీ సమంతకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు అన్నింటిలోనూ ది బెస్ట్‌ లభించాలని కోరుకుంటున్నా.
అతుల్యా రవి: అందమైన, అంకితభావం కల్గిన సమంతకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది నీకు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా.
అన్నపూర్ణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న వారందరి తరఫున సమంతకు హ్యాపీ బర్త్‌డే.
అనుపమ రాగ్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు సమంత.
జి.ధనంజయన్‌: ఎంతో నైపుణ్యం కల్గిన సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది మొత్తం సంతోషం, విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా.
చిన్మయి: రాక్‌స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే. ప్రతి విషయంలోనూ నీకు ది బెస్ట్‌ లభించాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu