టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ విడుదల దిశగా పనులను జరుపుకుంటోంది. నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
ఈ రోజున సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘శాకుంతలం’ సినిమా నుంచి సమంత స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘శకుంతల’ పాత్రలో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు.
ఇక తెలుగులో సమంత ‘యశోద’ సినిమా కూడా చేస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన కూడా ఆమె ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.
Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY
— Gunasekhar (@Gunasekhar1) April 28, 2022