HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి సమంత క్షమాపణలు!

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి సమంత క్షమాపణలు!

Samantha apologises to vija
స్టార్‌ హీరోయిన్‌ సమంత విజయ్ దేవరకొండతో కలసి ‘ఖుషీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా కథతో ఈ సినిమా తీస్తుండడం తెలిసిందే. సమంత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన మయోసైటిస్ బారిన పడడంతో ఖుషీ సినిమా షూటింగుకి అంతరాయం కలిగింది.

విజయ్ దేవరకొండతో కలసి సమంత ఇప్పటికే మహానటిలో సినిమా చేసిన సంగతి తెలిసిందే. రెండో సారి మళ్లీ విజయ్ తో ఖుషీ కోసం జత కడుతోంది. కశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను గతేడాది షూట్ చేశారు. అనంతరం మయోసైటిస్ సమస్య బారిన పడడంతో సమంత చికిత్స కోసం విరామం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఖుషీ షూటింగ్ ఆగిపోయింది.

ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో ప్రశ్నించగా.. దానికి సమంత బదులిచ్చింది. త్వరలోనే మొదలవుతుందని చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు (సినిమా ఇంతకాలం నిలిచిపోయినందుకు) అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు స్పందిస్తూ ముందు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu