HomeTelugu Trendingస్పెయిన్‌లో విహరిస్తున్న చైసామ్‌.. ఫొటోలు వైరల్‌

స్పెయిన్‌లో విహరిస్తున్న చైసామ్‌.. ఫొటోలు వైరల్‌

5 6టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌‌ నాగచైతన్య, సమంత స్పెయిన్‌లో విహరిస్తున్నారు. ఇద్దరు బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ఓ ఫొటోలో సామ్‌, చై బీచ్‌ దగ్గర కనిపించారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చై ఫొటోపైన సామ్‌.. ‘ఐ లవ్‌ యు 3000’ అని రాశారు. దీంతో ఆమె ‘ఐరన్‌ మ్యాన్‌’ అభిమానా?అనే సందేహం ఫ్యాన్స్‌కు కలిగింది. అదేవిధంగా ఈ జంట అక్కడి ఫేమస్‌ చెఫ్‌ డానీ గార్షియా రెస్టారెంట్‌కు కూడా వెళ్లారు. ఆహారం అద్భుతంగా ఉందని, తన జీవితంలోని ది బెస్ట్‌ మీల్స్‌లో ఇదొకటని సామ్‌ పేర్కొన్నారు.

సామ్‌, చై ఇటీవల ‘మజిలీ’తో మంచి హిట్‌ అందుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విజయం సాధించింది. సామ్‌ ప్రస్తుతం నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఓ బేబీ’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క తమిళ సినిమా ’96’ తెలుగు రీమేక్‌లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. చైతన్య ‘వెంకీ మామ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

5a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu