టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రానా దగ్గుబాటి వేద మంత్రాల సాక్షిగా మిహికా మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు రానా. నేడు (ఆగస్టు8) శనివారం హైదరాబాద్లో రామానాయుడు స్టుడియో వీరి వివాహానికి వేదికగా మారింది. రాత్రి 8.30 నిమిషాలకు వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది
మాత్రమే బంధువులు హాజరైయ్యారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక రానా పెళ్లి వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రానా బాబాయ్ వెంకటేష్ సైతం పెళ్లిలో సందడి చేశారు. అయితే కరోనా నేపథ్యంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయో సెక్యూర్ పద్ధతిలో పెళ్లివేడుకను నిర్వహించారు.
#RanaMiheekaWedding: @alluarjun #spotted looking stylish as ever, arriving at #RanaDaggubati & #MiheekaBajaj‘s wedding #RanaWedsMiheeka #RanaMiheeka #RanaDaggubati #Tollywood #RanaWedding pic.twitter.com/ZYoPVVZevw
— Hyderabad Times (@HydTimes) August 8, 2020