HomeTelugu Big Storiesచైతన్యతో సాహసయాత్ర .. సమంత వైరల్‌ పోస్ట్‌.. వన్ మిలియన్ లైక్స్!

చైతన్యతో సాహసయాత్ర .. సమంత వైరల్‌ పోస్ట్‌.. వన్ మిలియన్ లైక్స్!

4 11ప్రముఖ నటి అక్కినేని సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఓ చిత్రం తెగ వైరల్ అయింది. గంటలవ్యవధిలో ఈ ఫోటోకు 10 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. అంతలా ఈ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా? పెద్దగా ఏమీ లేదు. దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ పాత ఫోటోకు సమంత యునీక్ గా క్యాప్షన్ తగిలించడమే దీన్ని వైరల్ చేసింది.

“ఓ గొప్ప సాహసయాత్రకు మేము సిద్ధమవుతున్నాం… దాదాపుగా…” అంటూ డ్రైవింగ్ సీటులో నాగ చైతన్య, పక్కన సమంత, ఆమె చేతిలో వారి పెంపుడు కుక్క ఉన్నఫోటోను షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోకు వందల సంఖ్యలో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం చైతూ ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉండగా, లాక్‌డౌన్ తొలగించగానే షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత పలు చిత్రాలతో బీజీగా ఉంది.
https://www.instagram.com/p/CACxb6lhcw7/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu