స్టార్ హీరోయిన్ సమంత ఎంత బీజీగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా సమంత ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. `20 ఏళ్ల వయసులో మీ గురించి చెప్పండి?` అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `ఇంకా ఎదగాలి అనే తాపత్రయం తప్ప ఇంకేముంటుంది` అని సమాధానమిచ్చింది. అలాగే `2020లో మధుర జ్ఞాపకం ఏంటి?` అనగానే రానా పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది.
ఈ సమయంలోనే ఒక అభిమాని ట్రోలింగ్ గురించి ప్రశ్నించడంతో దానికి కూడా సమంత సరదాగానే సమాధానం చెప్పింది. ‘ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా. నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం నవ్వు వస్తుంటుంది. వారు ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిపిస్తుంద’ని సమంత చెప్పుకొచ్చింది. సమంత త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాంకుతలం’ సినిమా చేస్తోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.