టాలీవుడ్‌లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇందులో ఆమె నటనకుగానూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలాగే పుష్పలో ఆమె చేసిన ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. ఐటం సాంగ్ అయితే ఓ రేంజ్‌లో హిట్టయింది.
విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’
ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. తాజాగా క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సామ్ ఈ ఐటం సాంగ్‌పై స్పందించింది. ‘ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్ ఇండియా లెవల్‌లో హిట్టయింది. జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి, ఊ అంటావా మావా పాటలో చాలా బాగా చేశానని చెప్తున్నారు. ఇది నిజంగా సంతోషకరం’ అని చెప్పుకొచ్చింది.
@Samanthaprabhu2 About #OoAntavaa Song 🙌
More Than Interview Seeing That Smile in her Face 🥰#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/oIOGHycIQM
— Trends Samantha™ (@Trends_Samantha) March 10, 2022