సమంతతో విడిపోయాక నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ ఫోటో ద్వారా తేలింది. లండన్ లోని ఓ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని రుజువు అయ్యింది. దీంతో తాజాగా నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంపై సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైవాహిక బంధంలో నేను నిజాయతీగా ఉన్నాను. కానీ అది వర్కౌట్ కాలేదు. నేనే తప్పు చేయనప్పుడు నేనేందుకు బాధపడుతూ ఇంట్లో కూర్చోవాలి. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే పుష్పలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నా వాళ్లందరూ విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్ చేయడం బాగోదు అన్నారు. కానీ నేను అంగీకరించలేదు.’ అని సమంత చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం విడాకులపై సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అలాగే, రెమ్యునరేషన్ పై హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పారితోషికం విషయంలో ఇంత ఇవ్వండని అడుక్కునే పరిస్థితుల్లో తాను లేనని సామ్ స్పష్టం చేసింది. మనం చేసే శ్రమ ఆధారంగానే ఫలితం వస్తుందని నమ్ముతాను అని అన్నారు. మన కష్టాన్ని చూసే వాళ్లే ఇంత ఇవ్వాలని భావిస్తారని, శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలని ఆమె సూచించారు.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సామ్ ఓ ఇంటర్య్వూలో తన ఆరోగ్యంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మయోసైటిస్ వచ్చిన మొదట్లో బలహీనంగా అనిపించేది. యశోద మూవీ సమయంలో చాలా వీక్ గా ఉన్నాను. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఓపిక ఉండేది కాదని, అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలనుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తోంది. అని సామ్ చెప్పింది.
అన్నట్టు ఈ సినిమాలో అల్లుఅర్జున్ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది సామ్. ‘అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుందని, తనకి ఇంగ్లీష్ రాదని చెప్పింది. ఈ జనరేషన్ పిల్లలకి తెలుగు చక్కగా నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అంటూ సామ్ చెప్పుకొచ్చింది. మొత్తానికి ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు