స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అదరిపోయే పాటతో సర్ ప్రైజ్ చేశాడు. ‘అల వైకుంఠపురం’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నబన్నీ అభిమానుల కోసం ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశాడు. ఈ సినిమా నుంచి ‘సామజవరగమన’ అంటూ సాగే పాటను సోషల్‌మీడియా వేదికగా సినిమా యూనిట్ శనివారం విడుదల చేసింది. పాట లిరిక్స్, మ్యూజిక్ అదిరిపోయింది. పాట విన్నవాళ్లంతా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు.
అల వైకుంఠపురములో.. ‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రీలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.