స్టైలీష్ స్టార్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘సామజవరగమన’కు ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది. శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటకు సంబంధించిన వీడియోను ప్రముఖ నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. తమన్ స్వరాలు అందించిన ఈ సినిమాలోని ‘సామజవరగమన’ అనే పాటను సిద్ శ్రీరామ్ పాడారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో 100 వ్యూస్‌తో దూసుకువెళ్లింది. ఈ పాట విడుదలై చాలా రోజులైనప్పటికీ ఈ పాటకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ‘సామజవరగమన’ ఫిమేల్ వెర్షన్‌ను చిత్రబృందం విడుదల చేయడంతో ప్రేక్షకులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సింగర్ శ్రేయాఘోషల్ ఈ పాటను ఆలపించడంతో ఈ పాటకు మరింత క్రేజ్ పెరుగుతోంది. ‘సామజవరగమన’ పాట ఫిమేల్ వెర్షన్ ఆలపించడం తనకెంతో సంతోషంగా ఉందని శ్రేయా పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.