
Salman Khan about age gap with Rashmika Mandanna:
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న “సికందర్” మార్చి 30న విడుదల కానుంది. అర్ఎ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తోంది. కానీ సినిమా కంటే ఎక్కువగా చర్చనీయాంశం అవుతోంది… సల్మాన్-రష్మికల వయస్సు వ్యత్యాసం!
సల్మాన్ ఖాన్ 58 ఏళ్లు, రష్మిక మందన్నా 27 ఏళ్లు. ఇద్దరి మధ్య 31 ఏళ్ల గ్యాప్ ఉండటంతో సోషల్ మీడియాలో విమర్శలు ఊపందుకున్నాయి. కొంతమంది అభిమానులు, నెటిజన్లు ఈ విషయం పై మీమ్స్ విసురుతున్నారు. మరికొందరు మాత్రం “ఇలాంటి జంటలు బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు” అంటున్నారు.
తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. “వయస్సు తేడా అంతంత మాత్రమే. రష్మికకూ, ఆమె తండ్రికీ ఇలాంటి సమస్య ఏమీలేదు” అని చెప్పారు. అంతేకాదు, “రష్మిక పెళ్లి చేసుకుని భవిష్యత్తులో ఒక కూతురికి తల్లిగా మారినా, నేను ఆమె కూతురితో కూడా నటించగలను. రష్మికకూ ఇది ఓకేనే” అంటూ సరదాగా చెప్పారు. ఈ మాటలు వినగానే రష్మిక నవ్వుతూ సమ్మతించింది.
సల్మాన్ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది “మంచి జోక్” అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు “బాలీవుడ్ హీరోలు వయస్సు పెరిగినా యంగ్ హీరోయిన్‌లతోనే నటిస్తారు” అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, “సికందర్” సినిమా రష్మిక-సల్మాన్ కెమిస్ట్రీని ఎలా చూపిస్తుందో చూడాలి!