
Sikandar box office collection:
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోలు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. కానీ సినిమాకి కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా బాక్స్ ఆఫీస్ వసూళ్లలో పడిపోతుంది. తాజాగా రిలీజైన సికందర్ సినిమా అదే ఉదాహరణగా మారింది.
ఈ చిత్రం రంజాన్ స్పెషల్‌గా విడుదలయ్యింది. సల్మాన్ ఖాన్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ రివ్యూలు, మౌత్ టాక్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో థియేటర్లలో కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి.
ట్రేడ్ సర్కిల్స్‌లో వస్తున్న సమాచారం ప్రకారం, సికందర్ థియేట్రికల్ రన్ మొత్తం కలిపి వంద కోట్ల లోపే ఆగిపోతుందని అంచనా. ఇప్పుడు ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్‌గా దాదాపు రూ.120 కోట్లు తీసుకున్నాడట! అంటే సినిమా మొత్తం వసూలైన డబ్బు కూడా హీరోకి ఇచ్చిన పారితోషికానికి సరిపోదని పరిస్థితి.
దీంతో నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. థియేటర్లలో ఆటలు ఆపేసి, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మల్టీప్లెక్స్‌లతో కాంట్రాక్ట్‌లను ఒకేసారి రద్దు చేయడం అంత సులువు కాదు. వాటి వల్ల నష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటన చూస్తే ఓ స్పష్టమైన విషయం అర్థమవుతుంది – కంటెంట్ లేకుండా కేవలం స్టార్ పవర్ మీద ఆధారపడితే నిర్మాతలు భారీ నష్టాల్లో మునిగిపోతారు. ‘సికందర్’ మూవీ నిర్మాతలకు పాఠం చెబుతోంది – స్టార్ ఉండడం కాదు, కథ బలంగా ఉండాలి.