బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలను నెటిజన్లు టార్గెట్ చేశారు. వీరిలో సల్మాన్ ఒకరు. ఈ మధ్య సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. అక్కడి ఫొటోలను వరుసగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఆ మధ్య నాట్లు వేస్తూ, ఆ తర్వాత ఒంటినిండా బురదతో, ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ ఇలా రకరకాల ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. క్రికెటర్ ఎంఎస్ ధోనీ కూడా లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయం చేశాడు. కానీ ఇలా ప్రచారం చేసుకోలేదని, సల్మాన్ ఖాన్ పబ్లిసిటీ కోసం రోజుకొక ఫోటో, వీడియో పోస్ట్ చేస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలా మంది ఓవరాక్షన్ ఆపమని విమర్శలు చేశారు. ప్రజల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనే సల్మాన్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు.