సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల ఇప్పటివరకు వరకు చాలా మంది ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ లో పాల్గొన్నారు. కొందరు బాటిల్ కిందపడకుండా కాలితో తన్ని ఛాలెంజ్‌లో నెగ్గితే.. చేత్తో మూత తీసి నీళ్లుతాగేసి గెలిచేశాం అని చెప్పుకొన్నవారూ ఉన్నారు. అయితే వారందరికంటే కాస్త భిన్నంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. ఈ ఛాలెంజ్‌ను సల్లూ భాయ్ సునాయాసంగా పూర్తిచేస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ భాయ్ మాత్రం ఈ ఛాలెంజ్ ద్వారా ఓ మంచి సందేశాన్నిచ్చారు. బాటిల్ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ… ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 60 వేల మందికిపైగా లైక్ చేశారు. సల్లూభాయ్‌కి హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Don’t thakao paani bachao pic.twitter.com/PjfdGxdTJg
— Salman Khan (@BeingSalmanKhan) July 14, 2019