HomeTelugu TrendingSalman Khan: క్షమాపణ చెప్పాలి.. బిష్ణోయ్ కమ్యూనిటీ డిమాండ్‌

Salman Khan: క్షమాపణ చెప్పాలి.. బిష్ణోయ్ కమ్యూనిటీ డిమాండ్‌

 

Salman Khan

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలోని బవాద్ లో ఓ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1999లో వచ్చిన బాలీవుడ్ మూవీ హమ్ హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సందర్భంగా 1998లో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్‌లో అతనితో పాటు ఆ సినిమాలో నటించిన టబు, సొనాలి బింద్రె, నీలమ్ కూడా ఉండటంతో వాళ్లపైనా కేసులు నమోదు చేశారు.

2018లో ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ తర్వాత బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ మధ్యే సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన నేపథ్యంలో అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ ఈ ఘటనపై స్పందించింది. బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పింది.

“వేటను ఓ ఆటగా నేను అస్సలు అంగీకరించను. కానీ ఇది జరిగి చాలా ఏళ్లవుతోంది. 1998లో సల్మాన్ చాలా చిన్నవాడు. అందుకే బిష్ణోయ్ సమాజం పెద్దను నేను కోరుతున్నదేంటంటే దానిని ఇంతటితో వదిలేయండి. అతని తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. అతన్ని క్షమించండి” అని సోమీ అలీ కోరింది. న్యాయం కోసం కోర్టుకెళ్లాలి తప్ప మరొకరి ప్రాణాలు తీయడం తప్పని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పింది.

ఈకేసుపై బిష్ణోయ్ కమ్యూనిటీ మరోసారి స్పందించింది. సల్మాన్ స్వయంగా క్షమాపణ చెప్పాల్సిందే అని ఆ కమ్యూనిటీ డిమాండ్ చేశారు. ఈ తప్పు చేసింది సోమీ అలీ కాదు కదా అని ప్రశ్నించారు. “సల్మాన్ స్వయంగా క్షమాపణ చెబితే బిష్ణోయ్ సమాజం దానిని అంగీకరిస్తుంది. ఈ తప్పు చేసింది సల్మాన్ తప్ప సోమీ అలీ కాదు. అతని తరఫున ఎవరూ క్షమాపణ చెప్పకూడదు.

సల్మాన్ ఖాన్ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణ కోరితే మా సమాజం దానిని పరిశీలిస్తుంది. ఎందుకంటే మా 29 నిబంధనల్లో క్షమాపణ కూడా ఒకటి. అంతేకాదు సల్మాన్ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయబోనని చెప్పి పర్యావరణాన్ని కాపాడతానన్న ప్రతిజ్ఞా కూడా చేయాలి. అప్పుడే అతన్ని క్షమించే అంశాన్ని పరిశీలిస్తాం” అని దేవేంద్ర బుడియా అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu