
Salman Khan about prison life:
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి తన మేనల్లుడు అరహాన్ ఖాన్ నిర్వహిస్తున్న Dumb Biryani పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, జైలు అనుభవాలు, కష్టపడే పద్ధతుల గురించి సరదాగా చర్చించారు.
ఈ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జైలు అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. “జైల్లో ఉన్నప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేదాన్ని. అందుకే ఎక్కువగా నిద్రపోయేదాన్ని” అని చెప్పారు.
“నాకు సాధారణంగా రోజుకి గంటన్నర లేదా రెండు గంటలే నిద్రపోవడం అలవాటు. కొన్ని రోజులు ఏకంగా ఏడు గంటలు నిద్రపోతా. షూటింగ్ మధ్యలో ఐదు నిమిషాల సమయం దొరికితే, కుర్చీలోనే కునుకుతీసుకుంటా. జైల్లో ఉన్నప్పుడు మరీ ఏమీ చేయలేక, ఎక్కువ సమయం నిద్రపోయేవాణ్ని. కష్టపడి పని చేయడం, కుటుంబానికి సమయం కేటాయించడం అత్యవసరం.” అని సల్మాన్ చెప్పుకొచ్చారు.
సల్మాన్ 1998లో బ్లాక్‌బక్ వేట కేసు లో జైలుకు వెళ్లారు. 2006లో అయిదేళ్ల జైలు శిక్ష పడగా, తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. 2018లో మరోసారి శిక్ష పడినా, కొన్ని రోజులకే విడుదలయ్యారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ – ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఈద్ 2025 సందర్భంగా విడుదల కానుంది. అదనంగా Kick 2 చిత్రంతో సల్మాన్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ALSO READ: 100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి Bollywood movie ఏదో తెలుసా?