బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్-3’ తో సీనియర్ నటుడు, సినీ నిర్మాత మహేష్ మంజ్రేకర్ ముద్దుల తనయ సాయి ఎం మంజ్రేకర్ వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సల్మాన్ మంగళవారం ట్విటర్‌లో విడుదల చేసిన పోస్టర్‌లో నటి సాయి మంజ్రేకర్‌ను పరిచయం చేస్తూ.. ‘ఎటువంటి మాలిన్యం లేని స్వచ్ఛమైన మా అమాయకపు చిన్నారి ఖుషీ’ అనే వ్యాఖ్యలు జోడించారు. ‘దబాంగ్-3’ లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న హీరోయిన్ సోనాక్షీ సిన్హాతో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ పోస్టర్‌లను ఇప్పటికే రిలీజ్ చేశారు. సల్మాన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న దబాంగ్-3 ట్రైలర్ అక్టోబరు 23న బయటకు రానుంది. కాగా ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Hamari pure innocent masoom Khushi…#Dabangg3TrailerOutTomorrow@saieemmanjrekar @arbaazSkhan @sonakshisinha @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia pic.twitter.com/xrg1oYbjbQ
— Chulbul Pandey (@BeingSalmanKhan) October 22, 2019