బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఫ్లాట్ఫామ్ సింగర్ రాను మండల్ పాటకు ఫిదా అయిపోయాడు. వెంటనే తన లేటెస్ట్ మూవీలో ఆమెకు అవకాశం ఇచ్చేశారు. కాగా, సోషల్ మీడియాలో ఆమె పాటను చూసి.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మరీ బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా మొదట ఛాన్స్ ఇచ్చారు. తాను కంపోజ్ చేస్తున్న ‘తేరీ మేరీ కహాని’ సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చి పాట పాడించాడు. ఆమెతో కలిసి తానూ పాట పాడుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు.. దీంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది రనూ మండల్.. తనను దూరం చేసుకున్నవాళ్లు కూడా తన దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు.. ఆమె గాన మాధర్యానికి సల్మాన్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు. తన మూవీ ‘దబాంగ్3’లో ఒక పాట పాడటానికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుండగా.. మరోవైపు ఏకంగా రూ.55 లక్షల విలువైన ఇంటిని కూడా ఆమెకు బహుమానంగా ఇచ్చి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.