
Salman Khan Heroines:
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 30, 2025న ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె వయసు సల్మాన్ కంటే 30 ఏళ్లు తక్కువ కావడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
రష్మిక వయస్సు తక్కువగా ఉండటంతో, కొందరు సల్మాన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో అనన్య పాండే, జాన్వి కపూర్ లాంటి యంగ్ హీరోయిన్స్‌తో నటిస్తారా అని ప్రశ్నించగా, సల్మాన్ ఆసక్తికరంగా స్పందించారు.
“నిజంగా ఆ విషయాన్ని 10 సార్లు ఆలోచించాలి. వాళ్లు చాలా చిన్నవాళ్లు. వాళ్లతో రొమాన్స్ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది,” అని సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. అంటే రష్మికతో నటించడం ఓకే కానీ, మరింత యంగ్ హీరోయిన్స్‌తో చేయడానికి సిద్ధంగా లేడని చెప్పుకున్నట్లు.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సల్మాన్ తన స్టైల్‌లో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టనున్నాడు. రష్మికతో అతని కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి!
ALSO READ: MAD Square సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే