నటి జెనీలియా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులకు చేరువవుతోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అందులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ఆమె డాన్స్ చేసింది.
సోమవారం సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సినీ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జెనీలియా కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సల్మాన్‌కు శుభకాంక్షాలు తెలుపుతూ ఒక వీడియో పోస్టు చేసింది. ‘విశాల హృదయమున్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలా దేవుడు ఆశ్వీరదిస్తారు. ఈ రోజు భాయ్ పుట్టిన రోజు’ అని వీడియోకి కాప్షన్ ఇచ్చింది. ఆ వీడియోలో సల్మాన్‌తో కలిసి ఆమె అమెరికన్ చిత్రం ‘ఫూట్‌లూస్’ లోని పాటకు స్టెప్పులేసింది. ఓ పార్టీలో వారిద్దరు ఒకే రకం దుస్తులు ధరించి చుట్టూ ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 37లక్షలకుపైగా నెటిజన్లు వీక్షించారు.