HomeTelugu Trendingప్రియాంకకు సల్మాన్ ఖాన్ చురకలు..!

ప్రియాంకకు సల్మాన్ ఖాన్ చురకలు..!

7 19

సల్మాన్‌ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్‌, దిశా పటానీ నటిస్తున్న భారత్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 7న భారత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అలీ అబ్బాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకొన్నందుకు సల్మాన్‌కు ఇంకా కోపం తగ్గనట్లుంది. నిక్‌ జొనాస్‌తో పెళ్లి నిమిత్తం ప్రియాంక చివరి నిమిషంలో ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొన్నారు. దాంతో సల్మాన్‌కు కోపం వచ్చింది దాదాపు 4 నెలలుగా సల్మాన్‌ ఈ విషయంలో ప్రియాంకపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ప్రియాంకను ఉద్దేశిస్తూ ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు.

భారత్ ట్రైలర్‌ విడుదలయ్యాక కూడా ప్రియాంక తనకు ఫోన్‌ చేయలేదని అన్నారు. చివరి నిమిషంలో తాను తప్పుకొంటున్నానంటూ ప్రియాంక నాకు చెప్పకపోయి ఉంటే నేను కత్రినా కైఫ్‌ను సినిమాలో తీసుకోలేకపోయేవాడిని. ప్రియాంక వెళ్లిపోవడం వల్లే నాకు కత్రినాతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం దక్కింది. నేను ప్రియాంక వివాహ విందుకు వెళ్లినప్పటికీ తన నుంచి నాకు ఇప్పటివరకు ఫోన్‌ రాలేదు. ట్రైలర్‌ విడుదలైన రోజు కూడా ఆమె నాకు ఫోన్‌ చేయలేదు. ఒకవేళ తనకు నిజంగానే ఏదన్నా సమస్య ఉంటే నాకు ఫోన్‌ చేయకపోయినా ఫర్వాలేదు. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. సాధారణంగా నటీనటులు సినిమా కోసం ఏదైనా వదులుకుంటారు. భర్తల్ని కూడా వదులుకున్న నటీమణులు ఉన్నారు. కానీ ప్రియాంక మాత్రం భర్త కోసం భారత్‌ను వదులుకుంది అని చురకలంటించారు సల్మాన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu