అఖిల్ అక్కినేని మంచి హిట్ కోసం చూస్తున్నాడు. తాజాగా పూజా హెగ్డే హీరోయిన్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా మరో చిత్రానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన నూతన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు, అఖిల్‌కు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు సురేందర్ అన్నాడు. ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే ఇటీవల హీరోయిన్ దొరికేసిందట. మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్యను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికచేశారట. దర్శకుడు సురేందర్ అభిప్రాయం ప్రకారం అఖిల్‌కు ఆమె సరైన జోడీగా ఉంటుందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే సినిమా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో అఖిల్ స్పైగా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాను సురేందర్ ఇండియన్ జేమ్స్ బాండ్ స్థాయిలో చేయనున్నాడట.