Sakshi about CBN:
ఈ మధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో.. వైసిపి పార్టీ ఘోరా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసిపి. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు రూలింగ్ పార్టీ అయినా టిడిపి మీద.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద రకరకాలుగా బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ నడుపుతున్న సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తాజాగా సాక్షి పత్రిక ముఖ్యమైన వార్త అంటూ.. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి 16 కోట్ల బిల్లును చెల్లించాలి అని.. లేకపోతే ఆగస్టు 15 నుండి చికిత్సలు నిలిపివేస్తామని అల్టిమేట్ ఇచ్చినట్లు రాశారు.
అయితే అక్కడ లేనిది జోడిస్తూ సాక్షి పత్రిక.. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు సమయానికి చెల్లించేవారని.. కానీ చంద్రబాబు నాయుడు పాలనలో మాత్రం అలా లేదు అని పేర్కొన్నారు. అంతే కాకుండా జగన్ గురించి ప్రశంసిస్తూ పెద్ద వ్యాసం కూడా రాశారు. వార్తల కంటే ఎక్కువ జగన్ భజన మాత్రమే చేస్తున్న సాక్షి ఇలా పక్షపాతాన్ని బయటపెట్టింది. అసలు టిడిపి అధికారంలోకి వచ్చి రెండునెలలు కూడా కాలేదు.. ఇంత లోపే 1600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం సాధ్యమే కాదు.
పోనీ 1600 కోట్లు రెండు నెలల్లోనే పెండింగ్ లోకి వచ్చాయి అని అనుకుందాం. అలా అయినా కూడా హాస్పిటల్స్ కొత్త ప్రభుత్వంపై బిల్లుల కోసం ఒత్తిడి చేయడం కూడా సాధ్యం కాదు. 2023-24 బడ్జెట్ చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన పూర్తి బడ్జెట్‌లో.. మొత్తం సంవత్సరానికి 2,400 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఉంది.
మరి అలాంటప్పుడు సాక్షి పత్రిక చంద్రబాబునాయుడు రెండు నెలల్లోనే 1,600 కోట్లు పెండింగ్ లో ఉంచారని ఎలా కామెంట్ చేస్తుంది? ఈ నేపథ్యంలో ప్రజలు ఇలాంటి అసత్య వార్తలు ప్రచురించడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసిపి ఇకనైనా.. పవర్ లో ఉన్న టిడిపి మీద పక్షపాత వార్తలను రాయవద్దని ప్రజలు కోరుతున్నారు.