HomeTelugu Newsతొలి రోజే వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు'

తొలి రోజే వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’

అక్కినేని నటవరసుడు నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం మంచి వసూళ్లు కురిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగచైతన్య కెరీర్‌లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో ప్రారంభమైన చిత్రాల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకటని వెల్లడించారు.

6 12

తొలిరోజు వసూళ్లు: నైజాం: రూ.2.50 కోట్లు, సీడెడ్‌: రూ.1.04 కోట్లు, యూఏ: రూ.82 లక్షలు, తూర్పు గోదావరి: రూ.72 లక్షలు, పశ్చిమ గోదావరి: రూ.42 లక్షలు, కృష్ణ: రూ.40 లక్షలు, నెల్లూరు: రూ.23 లక్షలు, గుంటూరు: రూ.80 లక్షలు.. మొత్తం ‌: రూ.6.93 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమాలో నాగా చైతన్యకు జంటగా ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu