బాలీవుడ్ జంట సైఫ్అలీ ఖాన్, కరీనా కపూర్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కరీనా త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ‘మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మీ ప్రేమను ఎల్లప్పుడూ అందించే శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు’ అని ఓ ప్రకటనలో వెల్లడించారు. సైఫ్, కరీనా 2012లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు తైమూర్ అలీఖాన్ (3) ఉన్నాడు.