యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే రావణాసురిడిగా ఎవరు నటించబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చేసింది చిత్రబృందం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నట్లు ఓ పోస్ట్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంతకముందు కూడా ఓం రౌత్ తెరకెక్కించిన తానాజీ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది తెలియాల్సి ఉంది.