HomeTelugu Trendingబ్రో: సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌లుక్‌

బ్రో: సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌లుక్‌

Saidharam Tej First Look fr
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి విడుదలైన పవన్‌ పోస్టర్‌కి ఎక్కడలేని హైప్‌ తీసుకొచ్చింది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఈ సినిమా నుండి వరుస అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.

తాజాగా మేకర్స్‌ సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ మార్కండేయులు(మార్క్‌)గా కనిపించనున్నాడు. వైట్‌ అండ్‌ వైట్‌ లుక్‌లో సాయి ధరమ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అదిరిపోయింది. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

ఒక యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu