ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్‌రెడ్డి అలియాస్ సాయన్న. ప్రస్తుతం ప్రజల్లో కాసు మహేష్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. సాయన్నగా ఆదోని నియోజకవర్గ సుపరిచితుడైన సాయి ప్రసాద్ రెడ్డి ఉమ్మడి కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం రామాపురం గ్రామంలో సంపన్న రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సాయి ప్రసాద్ రెడ్డి 10వ తరగతి పూర్తి చేశారు. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన తండ్రి భీమిరెడ్డి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన తల్లి లలితమ్మ రామాపురం గ్రామ సర్పంచ్. అలాగే సాయి ప్రసాద్ రెడ్డి సోదరులు శివరామిరెడ్డి ఎమ్మెల్సీ, మరో సోదరుడు బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే, వెంకట రామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యే లుగా ఉన్నారు.
మొత్తానికి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉంది. పై అందరూ కీలక పదవుల్లో ఉండటం మరో విశేషం. తన తండ్రి భీమిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీలోకి చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. తండ్రి ఆకస్మిక మరణం తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో నియోజకవర్గ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఎన్టీఆర్ బ్రతికున్నంత వరకు ఆయనతోనే కొనసాగినా… అనంతర రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరై 2004 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఆదోని నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2009 లో ఓడిన తర్వాత తన సోదరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. 2014, 2019 లలో ఆదోని నుండి వరుసగా విజయం సాధించారు. మరి, రాజకీయ నాయకుడిగా సాయి ప్రసాద్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో సాయి ప్రసాద్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ సాయి ప్రసాద్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. సాయి ప్రసాద్ రెడ్డి పై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదోని ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తపించిన తన తండ్రికి భిన్నంగా సాయి ప్రసాద్ రెడ్డి కేవలం వాణిజ్య ధోరణితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఆదోని ప్రజల్లో కూడా సాయి ప్రసాద్ రెడ్డి పై ఇదే అభిప్రాయం ఉంది. దీనికితోడు 2019 ఎన్నికల తర్వాత నుండి నియోజకవర్గ వ్యవహారాల్లో సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జయమనోజ్ జోక్యం ఎక్కువుగా ఉందని, పదవుల విషయంలో సైతం సాయి ప్రసాద్ తనయుడి మాటకే ప్రాధాన్యత ఇవ్వడంతో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డికి అనుచరులే సహకరించకపో వచ్చు. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఎట్టిపరిస్థితి లో గెలవడు.