sai pallavi: ఫిదా బ్యూటీ సాయిపల్లవి ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమైయ్యాయి. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ తన ప్రియుడు వినీత్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పూజా కన్నన్ తెలియజేసింది.
ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెబుతూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. రెండు చేతులకు మెహందీ పెట్టుకుని పూజా కన్నన్ చాలా సంతోషంగా కనిపించింది. తన అక్క సాయిపల్లవితో కూడా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ వినీత్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈక్రమంలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చింది.
‘ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఎలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటివరకు నా క్రైమ్ పార్టనర్.. ఇప్పుడు నా పార్టనర్. ఐ లవ్‌యూ’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
ఈ క్రమంలో నెటిజన్లు పూజా కన్నన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెల్లి పెళ్లి అయిపోతుంది. మరీ అక్క పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.