సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వీరి కాంబోలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. దీనిపై అధికార ప్రకటన ఇదివరకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలో వీరి కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుందని టాక్. ‘అల వైకుంఠపురం’ తర్వాత త్రివిక్రమ్ నేరుగా దర్శకత్వం వహించడంతోపాటు అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌తో చేయనున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రంలో చిరంజీవికి సిస్టర్‌గా నటించే అవకాశాన్ని సాయి పల్లవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవే తెలిపింది. అందుకే ఆ ఆఫర్ తర్వాత మహానటి కీర్తి సురేష్‌కు దక్కింది. మరీ మహేశ్ బాబు పక్కన చెల్లెలిగా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుంటుందో వేచి చూడాలి.
అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం స్టార్ హీరో పక్కన చెల్లెలి పాత్ర పోషిస్తే తమ ఫేవరెట్ హీరోయిన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. అయితే మహేశ్ బాబు పక్కన సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తే మాత్రం హాపీ అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుంది. పూజాతో పాటు మరో హీరోయిన్‌ని కూడా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.