టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా ఇమేజ్‌ను తెచ్చుకున్న బ్యూటీ సాయిపల్లవి. గ్లామరస్ పాత్రలు దూరంగా ఉంటూ… నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలే తన చేస్తూ హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంటుంది ఈ భామ. అందుకే, ఈ సాయి పల్లవికి ఇంతవరకు స్టార్స్ తో నటించే అవకాశం రాలేదనే చెప్పచ్చు. అలాంటి సాయిపల్లవి త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పవన్ పక్కన హీరోయిన్ పాత్రకు సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతుందనేది త్వరలో వెల్లడవుతుంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాటపర్వం’, నాని ‘శ్యామ్ సింగ రాయ్’ల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.