HomeTelugu Trendingసాయి పల్లవి 'గార్గి' ఫస్ట్ లుక్ రిలీజ్ ...!

సాయి పల్లవి ‘గార్గి’ ఫస్ట్ లుక్ రిలీజ్ …!

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మలయాళం బ్యూటీ సాయి పల్లవి.. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది.అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ రెండు విజయాలు అందుకున్న సాయి పల్లవి.. ఇక ‘విరాటపర్వం’ జులై లో విడుదలకు సిద్దమవ్వుతోంది … ఈ క్రమంలో సాయి పల్లవి నటిస్తున్న గార్గి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది…

నేడు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు మేకింగ్ వీడియో గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘గార్గి’ సినిమా గురించి చెప్పడానికి కొన్ని నెలలుగా ఆసక్తిగా వేచి చూస్తున్నాను. ఫైనల్లీ నా బర్త్ డే నాడు ఈ గ్లింప్స్ రిలీజ్ చేయాలని టీమ్ డిసైడ్ చేసింది అని పల్లవి సోషల్ మీడియాలో పేర్కొంది.”గార్గి” చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ రామచంద్రన్ – ఐశ్వర్య లక్ష్మీ – థామస్ జార్జ్ – గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu