ఓ వైపు కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తుంటే కొందరు మనుషులు తనలోని మృగాన్ని నిద్రలేపుతున్నారు. తమిళనాడులో ఏడేళ్ల చిన్నారి పై మానవ మృగాలు అత్యాచారం చేసి హత్యచేశారు. ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి గ్రామ శివారులో ముళ్లపొదల్లో శవమై కనిపించింది. పోస్టుమార్టంలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణంపై హీరోయిన్ సాయిపల్లవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మానవజాతిపైనే నమ్మకం నశించిపోతుంది. రోజు రోజుకూ మానవత్వం చచ్చిపోతుందనిపిస్తోంది. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికే పిల్లలను చంపుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. నేరం బయట పడినప్పుడో లేక సోషల్ మీడియాలో ట్రెండ్ అయినప్పుడో మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని ప్రార్థిస్తున్నాను. బయటకు రాని నేరాలు, రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఇంకా ఏం జరుగుతుందో అంటూ.. ప్రతిచోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విషయాలు తెలియజెప్పేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోందని సాయి పల్లవి సెటైర్ వేసింది.
The hope in human race is deteriorating at such a fast pace. We misuse power that’s given to help the voiceless. We hurt ppl whom we find weaker. And we kill babies to satisfy our monstrous pleasures.
— Sai Pallavi (@Sai_Pallavi92) July 3, 2020